ఇప్పుడు టాలీవుడ్ లో మల్టి స్టారర్ చిత్రాల హవా ఎక్కువైంది. దానితో పాటు ఫ్యామిలీ చిత్రాలు కూడా రూపొందిస్తున్నారు. "ఫ్యామిలీ చిత్రాలంటే" కుటుంబ కథా చిత్రాలు కాదు ఒకే ఫ్యామిలీ హీరోలంతా కలిసి ఒకే చిత్రం లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. లేటెస్ట్ గా అక్కినేని ఫ్యామిలీ హీరోలంతా కలిసి నటిస్తున్న మనం షూటింగ్ జరుగుతుంది. త్వరలోనే రామానాయుడు ఫ్యామిలీ హీరోలతో ఓ చిత్రాన్ని నిర్మించడానికి రామానాయుడు సన్నాహాలు చేస్తున్నారు. వెంకటేష్, రానా, & నాగచైతన్య ల కలయికలో ఈ చిత్రం ఉంటుందని, త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి రానుందని సమాచారం.
దగ్గుబాటి ఫ్యామిలీ మల్టి స్టారర్ ?
12:26 AM
0
Share to other apps