టాలీవుడ్ లో పెద్దగా సక్సెస్ లు లేని తాప్సి కి హీరోయిన్ గా మంచి గుర్తింపే ఉంది. అయితే తాప్సి బాలీవుడ్‌లో ‘చష్మే బద్దూర్’ చిత్రం తో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే . ఆ చిత్రం మంచి హిట్ ఇవ్వడం తో ప్రస్తుతం తాప్సి కి బాలీవుడ్ లో వరసగా అవకాశాలు వస్తున్నాయి. లేటెస్ట్ గా బాలీవుడ్ సూపర్‌హిట్ ‘విక్కీడోనర్’ దర్శకుడు సూజిత్ సర్కార్ నిర్మిస్తున్న చిత్రంలో తాప్సీ కథానాయికగా ఎంపికయ్యారు. ‘కై పో చే’ ఫేం అమిత్ సద్ కథానాయకునిగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా ఛాయాగ్రాహకుడు అమిత్ రాయ్ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఇందులో తాప్సీ పాత్ర విభిన్నంగా ఉంటుందని సమాచారం. ఈ సినిమాతో పాటు తెలుగు, తమిళ భాషల్లో లారెన్స్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘ముని-3’ చిత్రం లో నటిస్తుంది తాప్సి.
బాలీవుడ్ లో క్రేజీ గా మారిన హాట్ బ్యూటి
12:21 AM
0
Share to other apps